Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Chary
Gang Leader
Name: రంగోజు వెంకటాచారి

Post Number: 3435
Points: 102,256
Member Since: Nov 30, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Saturday, December 05, 2009 @6:59:06 AM EST  

అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే
రాగం - శుద్ధవసంతం



పల్లవి
అంతరంగమెల్లా శ్రీహరి కొప్పించకుండితే
వింతవింత విధముల వీడునా బంధములు

చరణములు
మనుజుఁడై ఫలమేది మరిజ్ఞాని యౌదాఁకా
తనువెత్తి ఫలమేది దయగులుఁగుదాఁకా
ధనికుఁడై ఫలమేది ధర్మము సేయుదాఁకా
పనిమాలి ముదిసితే పాసెనా భవము


చదివియు ఫలమేది శాంతము కలుగుదాఁకా
పెదవెత్తి ఫలమేది ప్రియామాడు దాఁకను
మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాఁకా
యెదుట తా రాజైతే నేలేనా పరము


పావనుఁడై ఫలమేది భక్తి కలిగిన దాఁకా
జీవించి ఫలమేది చింతఁ దీరుదాఁకను
వేవేల ఫలమేది శ్రీవేంకటేశుఁ గన్నదాఁకా
భావించి తా దేవుడైతేఁ బ్రత్యక్షమవునా



Oh Goddess Saraswati !
My humble salutations to you, who are the fulfiller of all my wishes.
I start my studies with the request that thou will bestow Thy blessings on me.