Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Chary
Gang Leader
Name: రంగోజు వెంకటాచారి

Post Number: 3446
Points: 102,256
Member Since: Nov 30, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, December 06, 2009 @1:27:11 AM EST  

హరి యవతార మీతఁడు అన్నమయ్య
రాగం - శ్రీ



పల్లవి
హరి యవతార మీతఁడు అన్నమయ్య
అరయ మా గురుఁడీతఁ డన్నమయ్య


చరణములు
వైకుంఠ నాథుని వద్ద వడిఁ బాడుచున్నవాఁడు
ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య
ఆకశపు విష్ణు పాదమందు నిత్యమై వున్నఁవాఁడు
ఆకడీకడఁ దాళ్ళపాక అన్నమయ్య


క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుచు నున్నవాఁడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య
ధీరుఁడై సూర్యమండల తేజము వద్ద నున్నవాఁడు
ఆరీతులఁ దాళ్ళపాక అన్నమయ్య


ఈవల సంసారలీల ఇందిరేశుతో నున్నవాఁడు
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య
భావింప శ్రీవేంకటేశు పాదములందె యున్నవాఁడు
హావభావమై తాళ్ళపాక అన్నమయ్య



Oh Goddess Saraswati !
My humble salutations to you, who are the fulfiller of all my wishes.
I start my studies with the request that thou will bestow Thy blessings on me.