Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Chary
Gang Leader
Name: రంగోజు వెంకటాచారి

Post Number: 3495
Points: 102,256
Member Since: Nov 30, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 08, 2009 @1:58:38 AM EST  

అన్నిటికి నిది పరమౌషధము
రాగం - లలితపల్లవి
అన్నిటికి నిది పరమౌషధము
వెన్నుని నామమే విమలౌషధము


చరణములు
చిత్తశాంతికిని శ్రీపతినామమె
హత్తిన నిజ దివ్యౌషధము
మొత్తపు బంధవిమోచనంబునకు
చిత్తజ గురుఁడే సిద్ధౌషధము


పరిపరి విధముల భవరోగములకు
హరిపాద జలమె యౌషధము
దురిత కర్మములఁ దొలఁగించుటకును
మురహర పూజే ముఖ్యౌషధము


యిల నిహపరముల నిందిరావిభుని
నలరి భజింపుటె యౌషధము
కలిగిన శ్రీవేంకటపతి శరణమే
నిలిచిన మాకిది నిత్యౌషధముOh Goddess Saraswati !
My humble salutations to you, who are the fulfiller of all my wishes.
I start my studies with the request that thou will bestow Thy blessings on me.