Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Chary
Gang Leader
Name: రంగోజు వెంకటాచారి

Post Number: 3496
Points: 102,256
Member Since: Nov 30, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 08, 2009 @2:08:57 AM EST  

శరణంటి మాతని సంబంధమునఁ జేసి
రాగం - లలిత



పల్లవి
శరణంటి మాతని సంబంధమునఁ జేసి
మరిగించి మము నేలి మన్నింపవే


చరణములు
సకలవేదములు సంకీర్తనలు చేసి
ప్రకటించి నినుఁ బాడి పావనుఁడైన
అకలంకుఁడు తాళ్ళపాకన్నమాచార్యుల
వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ


నారదాది సనకసనందనాదుల వలె
పేరుపడి నిన్నుఁ బాడి పెద్దలైనట్టి
ఆరీతిఁ దాళ్ళపాకన్నమాచార్యూల్
చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ


సామవేద సామగాన సప్తస్వరములను
బాముతో నీసతి నిన్నుఁ బాడినయట్టి
ఆముకొన్న తాళ్ళపాకన్నమాచార్యుల
వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయ



Oh Goddess Saraswati !
My humble salutations to you, who are the fulfiller of all my wishes.
I start my studies with the request that thou will bestow Thy blessings on me.