Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Chary
Gang Leader
Name: రంగోజు వెంకటాచారి

Post Number: 3497
Points: 102,256
Member Since: Nov 30, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 08, 2009 @2:20:45 AM EST  

వలపులు వలపులు వయ్యాళి
రాగం - శంకరాభరణం



పల్లవి
వలపులు వలపులు వయ్యాళి
చలమరి మరుఁడును సమేళి


చరణములు
నెలఁత మోమునకు నీ కనుచూపులు
నిలువున ముత్తెపు నివాళి
కొలఁదికి మీరిన గురుకుచములకును
తొలఁకు నీ మనసు దువాళి


వనిత నిండు జవ్వన గర్వమునకు
ఘనమగు నీ రతి కరాళి
వెనక ముందరల వెలఁదిమేనికి నీ
పెనఁగు గోరికొన పిసాళి


పడఁతి కోరికల భావంబునకును
కడుఁగడు నీ తమి గయాళి
చిడిముడి మగువకు శ్రీవేంకటపతి
విడువని కూటపు విరాళి



Oh Goddess Saraswati !
My humble salutations to you, who are the fulfiller of all my wishes.
I start my studies with the request that thou will bestow Thy blessings on me.