Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Maga Maharaju
Name: Devarakonda Subrahmanyam

Post Number: 1760
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, August 31, 2008 @11:24:12 PM EST  

ఓడను జరిపే ముచ్చట గనరే (నౌకా చరిత్రము)
రాగం: సారంగ
తాళం: ఆది

ఓడను జరిపే ముచ్చట గనరే-వనితలార నేడు

ఆడువారు యమునకాడ కృష్ణుని గూడి
యాడుచు పాడుచునందఱు జూడగ

కొందరు హరికీర్తనములు బాడ
కొందఱానందమున ముద్దులాడ
కొందఱు యమునా దేవిని వేడ
కొందఱి ముత్యపుసరు లసియాడ

కొందఱు తడబడ బాలిండ్లు కదల
కొందఱు బంగారు వల్వలు వదల
కొందఱ కుటిలాలకములు మెదల
కొందఱు బల్కుచు కృష్ణుని కధల


కొందఱు త్యాగరాజ సఖుడే యనగ
కొందఱ కస్తూరి బొట్టు కరగగ
కొందఱ కొప్పుల వురులు జారగ
కొందఱ కంకణములు ఘల్లనగ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha