Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Maga Maharaju
Name: Devarakonda Subrahmanyam

Post Number: 1866
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, September 04, 2008 @12:41:54 AM EST  

అన్యాయము సేయకురా
రాగం : కపి
తాళం : ఆది

పల్లవి:
అన్యాయము సేయకురా - రామ
అన్యునిగా చూడకురా నా యెడ

అనుపల్లవి:

ఎన్నో తప్పులు గలవారిని రా
జన్య నీవు బ్రోచినావు గనుకను

చరణం:

1. జడభరతుడు జింకశిశువు నెత్తి బడలిక డీర్చగలేదా

2. కడలిని మునిగిన నొక కూర్మము కాపాడగలేదా

3. పుడమిని బాండవద్రోహిని ధర్మపుత్రుని బ్రోవగలేదా
నడిమి ప్రాయమున త్యాగరాజనుత
నా పూర్వజుభాధ దీర్పలేదని



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha