Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Chantabbay
Name: Devarakonda Subrahmanyam

Post Number: 247
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, July 18, 2008 @2:37:15 AM EST  

రాగం: శంకరాభరణం
తాళం: ఆది

పల్లవి:

సరోజదళనేత్రి హిమగిరి పుత్రి
నీ పదాంభుజములే సదా నమ్మినానమ్మా
శుభమిమ్మా, శ్రీ మీనాక్షమ్మ

అనుపల్లవి:

పరాకుసేయక వరదాయకి నీవలె
దైవము లోకములో గలదా
పురాణి శుకపాణి మధుకరవేణి
సదా శివునికి రాణి

చరణాలు:

1. కోరివచిన వారికెల్లను
కోర్కెలొసగే బిరుదుకదా అతి
భారమా నను బ్రోవ తల్లి
కృపాలవాల నే తాళజాలనే

2. ఇందుముఖి కరుణించమని
నిన్నెంతో వేడుకొంటిని నా
యందు జాగేల నమ్మ మరియాద
గాదు దయావతి నీవు

3. సామగాన వినోదిని గుణ
ధామ శ్యామకృష్ణ నుతే శుక
శ్యామలాదేవి నీవే గతి రతి
కామకామ్యదా కావవే నన్ను



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha