Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6670
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, November 26, 2009 @1:01:37 AM EST  

మరివేరె గతి ఎవ్వరమ్మా
రాగం : ఆనందభైరవి తాళం : చాపు

పల్లవి:

మరివేరె గతి ఎవ్వరమ్మ మహిలో బ్రోచుటకు

అనుపల్లవి:

శరణాగత రక్షకి నీవేయని
సదా నమ్మితి నమ్మితి మీనాక్షి

చరణం:

1. మధురాపుర నిలయ వాణీరమాసేవిత పదకముల
మధుకైటభ భంజని కాత్యాయని మరాళగమన
నిగమంతవాసిని

2. వరమిచ్చి తీవరమే బ్రోవు శివ
అంబయిది నీకు బరువా
నెఱదాతవు నీవుగదా శంకరి
సరోజభవాది సురేంద్రపూజిత

3. శుకశ్యామల ఘన శ్యామకృష్ణుని సోదరి కౌమారి
అకళంక కళాధరి బింబాధరి
అపార కృపానిధి నీవే రక్షింప

స్వర సాహిత్యం:

పాదయుగము మదిలో దలచి కోరితి
వినుము మదగజగమన పరుల నుతింపక నే
వరమొసగుసతతము నినునే మది మరువక నే
మదనరిపుసతి నిను హృదయములో
గతియని దలచి స్తుతిసలిపితే
ముదముతొ ఫలమొసగుటకు ధరలో
నతావన కుతూహల నీవెగా



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha