Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6809
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 08, 2009 @12:33:22 AM EST  

ఓ జగదంబ
రాగం : ఆనందభైరవి, తాళం : ఆది

పల్లవి:

ఓ జగదంబ నన్ను నీవు జవమున బ్రోవు

అనుపల్లవి:

ఈ జగతి గతియై జనులకు మఱి
తేజమున రాజవినుతయౌ
రాజముఖి సరోజనయన సుగుణ
రాజిరాజిత కామాక్షి

స్వరసాహిత్యం:

వర సితగిరినిలయుని ప్రియప్రణయిని
పరాశక్తి మనవిని వినుమా
మరియాద లెఱుగని దుష్ప్రభుల
కోరి వినుతింపను వరంబొసగి

చరణం:

1. కన్నతల్లి నాదుచెంత యింత
కన్నడ సలుపగ తగునా
నిన్ను నే నమ్మియున్నవాడగద
నన్నొకని బ్రోచుట కరుదా
అన్ని భువనంబుల గాచెవు ప్ర
సన్నమూర్తి అన్నపూర్ణ వరదా
విన్నపంబు విన్నవింతు సన్నిధి వి
పన్న భయవిమోచన ధౌరేయ

2. జాలమేల శైలబాల తాళ
జాలను జనని నిన్ను వినా
పాలనార్ధముగ వేరెదైవముల
లోలమతినై నమ్మితినా
నీలనుత శీలము నే నేచ్చటనైనా
గానగానలోలహృదయా
నీలకంఠరాణి నిన్ను నమ్మితిని
నిజంబుగ బలికేది దయచేసి

3. చంచలాత్ముడేనేమి పూర్వ
సంచితముల సలిపితినో
కంచికామాక్షి నేడు నిన్ను పొడ
గాంచితిని శరణు శరణు నీ
వించుక దకృంచల గతి నా దెస
నుంచనమ్మ శ్యామకృష్ణ వినుతా
మంచికీర్తి మించనట్టి దేవివి మ
దించి మ దపరాధముల సహించి



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha