Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6812
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 08, 2009 @1:22:51 AM EST  

పాలించు కామాక్షి పావని
రాగం : మధ్యమావతి, తాళం : ఆది

పల్లవి:

పాలించు కామాక్షి పావనీ పాపశమనీ

అనుపల్లవి:

చాలా బహువిధముగా నిన్ను
సదా వేడుకొన్న నాయందేల
ఈలాగు జేసేవు వెత హరియించి
వేవేగమే నన్ను

చరణం:

1. స్వాంతములోన నిన్నే తలచేను జనులకెల్ల నేవేళ
సంతోషము లొసగేవని నీవు మనోరధఫలదాయిని
కాంతమగు పేరుపొందితివి కారుణ్యమూర్తివై జగము
కాపాడినతల్లి కదా నేను నీదుబిడ్డను లాలించి

2. ఈమూర్తి యింత తేజోమయమై
యిటువలె కీర్తి విస్పూర్తి యిట్లా నయగు
ణమార్తి త్రిలోకముల జూచిన నైన గలదా
ఏమి తొలినోము నోచితినో
నీ పాదపద్మ దర్శనము
వేమారు లభించిన కృతార్ధుడనైతి
నా మనవి యాలించి

3. రాజాధిరాజ రాజన్మకుట తటమణి రాజి భాజాల
నిజసన్నిధి దేవి సమస్త జనులకెల్ల వరదా
రాజముఖి శ్యామకృష్ణనుత
కాంచీపురీశ్వరీ వికచ
రాజీవదళాక్షి జగత్సాక్షి
ఓ ప్రసన్న పరాశక్తి

స్వర సాహిత్యము:

కనకగిరిసదన లలిత నిజభజన సంతతము చేయని జనుడన్
వినుము నఖిలభువన జనని యిపుడు మా దురితము దీర్చి వరాలిచ్చి



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha