Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6831
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Tuesday, December 08, 2009 @11:34:28 PM EST  

తల్లి నిన్ను
రాగం : కల్యాణి, తాళం : మిశ్రచాపు

పల్లవి:

తల్లి నిన్ను నెఱనమ్మినాను వినవే

అనుపల్లవి:

ఎల్ల లోకముల కాధారమై యున్న నా

చరణం:

1. ఆదిశక్తి నీవు పరాకు సేయక
ఆదరించుట కిది మంచి సమయము
గాదా సరోజభవాచ్యుత శంభునుత
పాద నీదు దాసానుదాసుడౌ నా

2. దేవి నీదు సరిసమాన మెవరని
దేవరాజు మునులు నిన్ను పొగడగ
నావెత దీర్చి బిరాన వరాలొసగి
నన్ను బ్రోవ నీజాలమేలనే

3. శ్యామకృష్ణ పరిపాలిని జనని
కామితార్ధప్రద కంజలోచని
కౌమారిరాణి పురాణి పరాశక్తి
కామకోటి పీఠాధివాసిని



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha