Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ♫۞ శ్యామ శాస్త్రి కీర్తనలు♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6833
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, December 09, 2009 @12:06:39 AM EST  

త్రిలోకమాతా
రాగం : వరజు , తాళం : మిశ్రలఘు

పల్లవి:

త్రిలోకమాతా నన్ను బ్రోవు కరుణను
దినదినమికను బ్రోవుము అంబ

అనుపల్లవి:

విలోకింపుము పదయ నన్ను చల్లని
వీక్షించి క్షణమున కామాక్షి

చరణం :

1. నిన్ను నమ్మియుండగ శ్రమపడవలెనా
నే నెందు గాన దిక్కు నిన్నువినా
ఘనముగా కోరికల కోరి కోరి యేమి
కానక ఖిన్నుడైతి ధన్యుసేయ

2. జపము లెఱుగనే తపము లెఱుగనే
చపలచిత్తుడను సతతము కృపకు
పాత్రుడనుచు వేడెదను నిను
కీర్తించియెట్లైన నీ బిడ్డయని

3. మరువక నిన్ను నే మది తలచగను
మన్నించి వెఱువకు మనరాదా
శరణనే సుజనులపాలి కల్ప వ
ల్లి శంకరీ శ్యామకృష్ణ సోదరీ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha