Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6935
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, December 17, 2009 @12:16:50 AM EST  

దుడుకుగల నన్నే (పంచరత్న కృతి)
రాగం : గౌళ
తాళం : ఆది

పల్లవి :

దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా ఎంతో

అనుపల్లవి:

కడుదుర్విషయా కృష్ణుడై ఘడియ ఘడియకు నిండారు

చరణం:

1. వనితాహృత్కుముదాబ్జ అవాఙ్ఞ్మానసగోచర
2. సకలభూతములందు నీవై యుండగ మదిలేకబోయిన
3. చిఱుతప్రాయములనాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన
4. పరధనములకొరకు పరుల మది కరగబలికి కడుపునింప తిరిగినట్టి
5. తనమదిని భువిని సౌఖ్యపుజీవనమె యనుచు సదా దినములు గడిపే
6. తెలియని నటవిటక్షద్రులు వనితలు స్వవశమౌట కుపదేశించి సంతసిల్లి
స్వరలయంబులెఱుంగకను శిలాత్ములై సుభక్తులకు సమానమను
7. దృష్టికి సారంబగు లలనా సదనార్భకసేనామిత ధనాదులను
దేవాదిదేవ నెరనమ్మితిగాకను నీ పదాబ్జభజనంబు మఱచిన
8. చక్కని ముఖకమలంబును సదా నా మదిలో
స్మరణలేకనే దుర్మధాంధ జనులకోరి
పరితాపములచేదగిలి నొగిలి
దుర్విషయ దురాసలను రోయలేక
సతతమపరాధియై చపలచిత్తుడైన
9. మానవతను దుర్లభమనుచు నెంచి పరమా
నందమొందలేక మదమత్సర కామలోభ
మోహులకు దాసుడనయి మోసబోతిగాక
మొదటి కులజడగుచు భువిని
శూద్రుల పనులు సల్పుచునుంటినిగాక
నరాధములను చేర రస విహీనమయినను సాధింప తారుమారు
10. సతులకు కొన్నాళ్ళాస్తికై సుతులకు కొన్నాళ్ళు
ధనతతులకై తిరిగితినయ్యా త్యాగరాజాప్త ఇటువంటి



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha