Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6938
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, December 17, 2009 @12:46:51 AM EST  

కన కన రుచిర (పంచరత్న కృతి)
రాగం : వరాళి
తాళం : ఆది

పల్లవి :

కనకన రుచిరా సనకవసన నిన్ను

అనుపల్లవి :

దినదినమును మనసున చనువున నిన్ను

చరణం:

1. పాలుగారు మోమున శ్రీ యపారమహిమ దనరు నిన్ను
2. తళతళమను ముఖకళ గలిగిన సీత కులుకుచు ఓరకన్నుల జూచె నిన్ను
3. బాలార్కభ సుచేల మణిమయ
మాలాలంకృత కంధర సరసిజాక్ష వర
కపోల సురుచిర కిరీటధర సతతంబు మనసారగ
4. సాపత్నీమాతయౌ సురుచిచేకర్ణ
శూలమైన మాట వీనుల
చురుక్కన తాళక శ్రీహరిని
ధ్యానించి సుఖింపగలేదా యటు
5. మృగమదలలామ శుభనిటల
వరజటాయు మోక్షఫలద
పవమానసుతుడు నీదు మహిమ దెల్ప సీత
తెలిసి వలచి సొక్కలేదా ఆ రీతి నిన్ను
6. సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహమానస
విహారాప్త సురభూజమానిత గుణాంక చిదానంద
ఖగ తురగ దృతరధంగ పరమ దయాకర
కరుణారస వరుణాలయ భయాపహరా శ్రీరఘుపతే
7. కామించి ప్రేమమీర కరముల నీదు పాదకమలముల
పట్టుకొనువాడు సాక్షి రామనామ రసికుడు కైలాస
సదనుడు సాక్షి మరియు నారద పరాశర శుక శౌనక
పురందర నగజాధరజ ముఖ్యులు సాక్షిగాద
సుందరేశ సుఖకలశాంబుధి వాసాశ్రితులకే
8. సతతము ప్రేమపురితుడగు త్యాగరాజ
నుత ముఖజిత కుముదహిత వరద నిన్ను



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha