Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6939
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, December 17, 2009 @1:07:27 AM EST  

రామ రామ నీవారము
రాగం : ఆనందభైరవి
తాలం : ఆది

పల్లవి:

రామ రామ నీవారము గామా రామా సీతా

అనుపల్లవి:

రామ రామ సాధుజన ప్రేమ రారా

చరణం:

1. మెఱుగుజేలము గట్టుక మెల్ల రారా రామ
కఱకు బంగరు సొమ్ములు కదల రారా
2. వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామ
మఱుగు జేసికొనేదట్టి మహిమ రారా
3. మెండైన కోదండకాంతి మెఱయ రారా కనుల
పండువగయుండు ఉద్దండ రారా
4. చిఱునవ్వుగల మోముజూప రారా రామ
కరుణతో నన్నెల్లప్పుడు గాన రారా
5. కందర్పసుందరానందకంద రారా నీకు
వందనము జేసెద గోవింద రారా
6. ఆద్యంతరహిత వేదవేద్య రారా భవ
వైద్య నే నీవాడనైతి వేగ రారా
7. సుప్రసన్న సత్యరూప సుగుణ రారా రామ
అప్రమేయ త్యాగరాజు నేల రారా



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha