Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6944
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, December 17, 2009 @5:24:55 AM EST  

పతికి హారతీరే
రాగం : సురటి
తాళం : ఆది

పల్లవి:

పతికి హారతీరే సీతా

చరణం:

1. అతిమ్రుదుతర సత్య భాషణునికి
అఖిలాండనాధునికి సీతా
2. బంగరురంగు భుజంగునిపైని చె
లంగుచును మరకతాంగుడు మెఱపు తె
ఱంగున మెఱియు తన యంగనతో బలు
కంగ జూచి యుప్పొంగుచు సీతా
3. అక్కరతో నిరుప్రక్కల నిలిచి త
ళుక్కని మెఱయగ చక్కనిమోమున
చుక్కలరాయుని మక్కువతో సరి
ముక్కెర కదలగ గ్రక్కున సీతా
4. రాజవిభాకర రాజధరామర
రాజకురాజ విరాజులు చూడగ
రాజమానమగు గాజులు ఘల్లన
రాజిత త్యాగరాజనుతునికి సీతా



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha