Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 6948
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, December 17, 2009 @5:41:23 AM EST  

శ్రీరామ జయరామ
రాగం : యదుకుల కాంభోజి
తాళం : ఝుంపె

పల్లవి:

శ్రీరామ జయరామ శృంగార రామయని
చింతించరాదే ఓ మనసా

చరణం:

1. తళుకు జెక్కుల ముద్దు బెట్ట కౌసల్య మును | తపమేమి చేసెనో తెలియ
2. దశరధుడు శ్రీరామ రారయని బిలువ మును | తపమేమి చేసెనో తెలియ
3. తనివారి పరిచర్య సేయ సౌమిత్రి మును | తపమేమి చేసెనో తెలియ
4. తనవెంత జన జూచి యుప్పొంగ కౌసికుడు | తపమేమి చేసెనో తెలియ
5. తాపమణగి రూపవతియౌట కహల్య | తపమేమి చేసెనో తెలియ
6. ధర్మాత్మ చరణంబుసోక శివచాపము | తపమేమి చేసెనో తెలియ
7. తన తనయ నొసగి కనులార జనకుండు | తపమేమి చేసెనో తెలియ
8. దహరంబు కరుగ కరమునుబట్ట జానకి | తపమేమి చేసెనో తెలియ
9. త్యాగరాజాప్త యని బొగడ నారదమౌని | తపమేమి చేసెనో తెలియ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha