Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Mutaa Mestri
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7143
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, January 10, 2010 @11:11:51 PM EST  

క్షీరసాగర శయనా
రాగం : దేవగాంధారి
తాళం : ఆది

పల్లవి

క్షీరసాగర శయనా నన్ను - చింతల బెట్టవలెనా రామ

అనుపల్లవి :

వారణ రాజును బ్రోవగ వేగమే - వచ్చినది విన్నానురా రామ

చరణం :

నారీమణికి జీరలిచ్చినది - నాడె నే విన్నారురా రామ
ధీరుడౌ రామదాసుని భందము - దీర్చినది విన్నానురా రామ
నీరజాక్షికై నీరధి దాటిన - నీ కీర్తిని విన్నానురా రామ
తారకనామ త్యాగరాజార్చిత - దయతో నేలుకోరా రామ



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha