Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ త్యాగరాజ కృతులు ♫۞

PostedBy Message

Dsubrahmanyam
Indra
Name: Devarakonda Subrahmanyam

Post Number: 7639
Points: 100,335
Member Since: Jun 21, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Thursday, March 04, 2010 @1:38:46 AM EST  

రాగ: మద్యమావతి
తాళ: ఆది

పల్లవి

ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా ముదితలార జూతమురారే

అనుపల్లవి

పచ్చని దేహిని పరమ పావనిని పార్వతిని దలచుచును హరుడేగెడు


చరణం 1
చల్లరె వేల్పుల రీతి నరుల కర పల్లవములను తళుక్కనుచు బిరుదులెల్ల మెరయ
నిజ భక్తులు పొగడగ ఉల్లము రంజిల్ల తెల్లని మేనున నిండు సొమ్ములతో మల్లే
హరములు మరి శోభిల్లగ చల్లని వేళ సకల నవరత్నపు పల్లకిలో వేంచేసి
వచ్చు


చరణం 2
హితమైన సకల నైవేద్యంబుల సమ్మతమున అడుగడుగు కారగింపుచు
మితములేని ఉపచారములతో నతి సంతోషమున సతతము జప తపముల
నొనరించు నతజనుల-
కభీష్టము లవ్వారిగ వెతకి ఒసగుదు ననుచు పంచనదీపతి వెడలి సొగసు
మీరగ వచ్చు


చరణం 3
భాగవతులు హరి నామ కీర్తనము బాగుగ సు-స్వరములతో వింత రాగములను
ఆలాపము
చేయు వైభోగములను జూచి నాగ భూషణుడు కరుణానిధియై వేగము సకల
సుజన
రక్షణమున జాగరూకుడై కోర్కెల నొసగు త్యాగరాజు తా ననుచును వచ్చు



We are shaped by our thoughts; We become what we think. When the mind is pure , joy follows like a shadow that never leaves -- Goutama Buddha