Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Indian
Maga Maharaju
Name: మహిత

Post Number: 1146
Points: 166,683
Member Since: May 10, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Saturday, March 08, 2008 @2:02:24 AM EST  

నాదనామక్రియ - ఏక

పాహిరామప్రభో పాహిరామప్రభో
పాహిభద్రాద్రివైదేహిరామప్రభో...!పా..!

శ్రీమన్మహగుణస్తోమాభిరామ మీ
నామకీర్తనలు వర్ణింతు రామప్రభో...!పా!

సుందరాకార హృన్మందిరోధ్ధార సీ
తేందిరా సంయుతానంద రామప్రభో...!పా..!

ఇందిరా హృదయారవిందాదిరూఢ
సుందరాకార ఆనంద రామప్రభో..!పా..!

ఎందునేజూడ మీ సుందరాననము
కందునో కన్నులింపొంద రామప్రభో...!పా..!

పుణ్యచారిత్ర లావణ్య కారుణ్య గాం
భీర్య దాక్షిణ్య శ్రీరామచంద్రప్రభో...!పా..!

కందర్పజనక నాయందు రంజిల సదా
నందుడవై పూజలందు రామప్రభో..!పా..!

ఇంపుగా జెవులకు న్విందుగా నీ కథల్
కందుగా మిమ్ము సొంపొంద రామప్రభో..!పా..!



స్నేహం అనే మొక్కకు అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి