Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ భద్రాచల రామదాసు కీర్తనలు ♫۞

PostedBy Message

Indian
Maga Maharaju
Name: మహిత

Post Number: 1148
Points: 166,683
Member Since: May 10, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Monday, March 10, 2008 @6:49:03 AM EST  

గౌళిపంతువరాళి - ఆది

పల్లవి

శ్రీరామ నీనామ మేమిరుచిరా
ఓరామా నీనామ మెంతరుచిరా...శ్రీ...

చరణములు

కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణల గాచిన నీనామ మేమెరుచిరా...శ్రీ...

కదళీ ఖర్జూరాది ఫలములకధికమౌ కమ్మన నీనామ మేమెరుచిరా...శ్రీ...

నవరసములకన్న నవనీతములకంటె నధికమౌ నీనామ మేమెరుచిరా...శ్రీ...

పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె నధికమౌ నీనామ మేమెరుచిరా...శ్రీ...

అంజనతనయ హృత్కమలంబునందు రంజిల్లు నీనామ మేమెరుచిరా...శ్రీ...

శ్రీసదాశివుడు తానేవేళ భజియించు శుభరూప నీనామ మేమెరుచిరా...శ్రీ...

సారములేని సంసార తరణమునకు తారకము నీనామ మేమెరుచిరా...శ్రీ...

శరణన్న జనులను సరగున రక్షించు బిరుదు కల్గిన నీనామ మేమెరుచిరా...శ్రీ...

తుంబుర నారదుల్ డంబుమీరగ గానంబు జేసెడి నీనామ మేమెరుచిరా...శ్రీ...

అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీనామ మేమెరుచిరా...శ్రీ...



స్నేహం అనే మొక్కకు అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి