Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Indian
Maga Maharaju
Name: మహిత

Post Number: 1209
Points: 166,683
Member Since: May 10, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, March 10, 2008 @1:16:07 PM EST  

ముల్లంగి తాళింపు

కావలసినవి.
ముల్లంగి - 1/4 కె.జీ, ఎందుమిరపకాయలు - 10, ఉప్పు - తగినంత, ఎండుకొబ్బరి - కొద్దిగా, పప్పులు (పుట్నాలు) - ఒక పిడికెడు, తెల్లగడ్డలు - 1 గడ్డ, ఉల్లిపాయలు - 2, నూనె - కొద్దిగా, పోపుకు ఆవాలు జీలకర్ర.

విధానం:
ముల్లంగి తురుముకోని దానిపై కొద్దిగా ఉప్పు చల్లి ఒక అరగంట అలాగె ఉంచి పిదప దానిని నీరు లేకుండా గట్టిగా పిండుకొన వలెను..
ఇపుడు బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులోనికి ఆవాలు జీలకర్ర వేసి పిదప వలచిన తెల్లగడ్డలు, మీడియం సైజులో తరిగిన ఉల్లిపాయలు వేసి అవి కొద్దిగా మగ్గిన పిదప ముల్లంగి తురుము వేసి మూతపెట్టి మగ్గనీయవలెను. అది మగ్గిన పిదప (ఎండు మిరప, ఎండు కొబ్బరి, ఉప్పు, పప్పులు ఆడించిన)కారం చల్లి 2 నిముషాలు ఉంచవలెను..



స్నేహం అనే మొక్కకు అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి