Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Indian
Maga Maharaju
Name: మహిత

Post Number: 1781
Points: 166,563
Member Since: May 10, 2007
Status :

Rating:
Votes: 2  (Vote)

Posted On Wednesday, April 09, 2008 @8:15:11 AM EST  

కాలిప్లవర్ రైస్
పదార్థమలు : బియ్యము - 200 గ్ర.,కాలిప్లవర్ - 1, క్యారెట్ - 1 పెద్దది, బటానీలు - 1 పిడికెడు, అల్లం - 1 ఇంచి, వెల్లుల్లి రెబ్బలు - 15, పచ్చి కోబ్బరి తురుము - కొద్దిగా, పచ్చి మిర్చి - 4, యాలక్కి - 1. లవంగం - 2,చెక్క - 1 చిన్న పీసు,పోపుకు సాసవలు, జీలకర్ర..

విధానం:
1.బియ్యము కడిగి నీరంతా వంపి వాటికి 1 స్పూన్ నూనెలో వేయించుకొని. అవి పూర్తి తెల్లగా మారిన పిదవ వాటిలోనికి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి అన్నం చేసుకోవలెను.
2. బటాణీలు,కాలిప్లవరు (విడిపించి) ఉడికించి పెట్టుకోవలెను.క్యారెట్ తురుముకొని పెట్టుకోవాలి.
3.పచ్చికొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
4.ఇప్పుడు బాణలిలో 3 స్పూన్ల నూనే వేసి వరుసగా సాసవలు, జీలకర్ర, యాలక్కి, లవంగం, చెక్క, క్యారెట్ తురుము వేసి తురుము కొద్దిగా వేగినపిదప అల్లంపేస్టు 2 ని. తరువాత బఠాణీలు పిమ్మట కాలిప్లవరు వేసి అవి కొద్దిగా వేగిన పిదప చివరగా రైసు వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉంచవలెను...అంతే నోరూరించె కాలిప్లవర్ రైసు రెడీ టు ఈట్



స్నేహం అనే మొక్కకు అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి