Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Indian
Gang Leader
Name: మహిత

Post Number: 2832
Points: 166,683
Member Since: May 10, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Thursday, July 03, 2008 @6:28:24 AM EST  

రాగం : భూపాళం

!!ప!! విన్నపాలు వినవలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్త వేలయ్యా

!!చ!!తెల్లవారె జామెక్కె దేవతలు మునులు
అల్ల నల్ల నంతనింత నదిగో వారే
చల్లని తమ్మి రేకుల సారసపుగన్నులు
మెల్లమెల్లన విచ్చి మేలుకొనవేలయ్య !!విన్నపాలు!!

!!చ!!గరుగ కిన్నర యక్ష కామినలుగములై
విరహపు గీతముల వింతాలాపాల
పరిపరి విధములబాడేరు నిన్నదివో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా !!విన్నపాలు!!

!!చ!! పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజ భవాదులు నీ పాదాలు చేరి
అంకెల నున్నారు లేచి అలమేలు మంగను
వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా !!విన్నపాలు!!



స్నేహం అనే మొక్కకు అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి