Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Indian
Gang Leader
Name: మహిత

Post Number: 2877
Points: 166,683
Member Since: May 10, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Sunday, July 06, 2008 @6:18:28 AM EST  

రాగం : భూపాళం

!!ప!! ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు
నప్పడగు తిరువేంకాటాద్రీశుగంటి

!!చ!! అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి
శతకోటి సూర్యతేజములు వెలుగగ గంటి
చతురాస్యు బొడగంటి చయ్యన మేలుకంటి !!ఇప్పుడిటు!!

!!చ!!కనకరత్న కవాటకాంతు లిరుగడ గంటి
ఘనమైన దీప సంఘములు గంటి
అనుపమ మణిమయమగు కీరీటము గంటి
కనకాంబరము గంటి గక్కన మేలు కంటి !!ఇప్పుడిటు!!

!!చ!! అరుదైన శంఖచక్రాదు లిరుగడ గంటి
సరిలేని అభయ హస్తము గంటి
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి
హరి గంటి గురు గంటి నంతట మేలుకంటి !!ఇప్పుడిటు!!



స్నేహం అనే మొక్కకు అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉండాలి