Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Prasanna
Maga Maharaju
Name: Prasanna

Post Number: 1565
Points: 27,141
Member Since: May 8, 2008
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, October 06, 2008 @12:40:16 AM EST  

కాలీఫ్లవర్ పరాఠా:
కావలసిన పదార్థాలు:
(సుమారుగా పన్నెండు పరాఠాలు చెయ్యటానికి)
ఒక పెద్ద కాలీఫ్లవర్, గోధుమపిండి, పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం ముక్క, కొత్తిమీర, ఉప్పు, నెయ్యి లేక నూనె

చేసే పద్ధతి:
కాలీఫ్లవర్ పెద్ద పెద్ద ముక్కలుగా విడగొట్టుకుని బాగా కడగి తురమాలి.
అల్లం కూడా తురమాలి. కొద్దిగా ఉప్పు వేసి ఉంచాలి. 5 నిముషాల తర్వాత దీన్ని పిండి వచ్చిన నీటిని ఉపయోగించి మరి కాసిని నీళ్ళు కూడా పోసి గోధుమపిండి చపాతీలు చెయ్యటానికి అనువుగా కలుపుకోవాలి.
నీళ్ళు పిండిన కాలీఫ్లవర్ తురుములో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు కలపాలి.

గోధుమపిండితో చపాతీ చేసి కాలీఫ్లవర్ మిక్స్ కొంచెం మధ్యలో పెట్టి నాలుగు వైపులనుంచీ చపాతీని మూసి కొద్దిగా పొడి పిండి చల్లి మళ్ళీ వత్తుకోవాలి. ఇప్పుడిది దీర్ఘచతురస్రాకారంగా వస్తుంది

పెనం మీద దీన్ని రెండువైపులా కాల్చాలి.కాలిన తరువాత కొద్దిగా నెయ్యి వేసి మరో నిముషం కాల్చి తీసెయ్యాలి. ఇలా అన్నీ చెయ్యాలి
పెరుగు కాంబినేషన్ తో ఇవి తినాలి.


This is one of our favorite dishes