Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Tagore
Name: Gargi Pv

Post Number: 10155
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Friday, September 12, 2008 @2:13:18 AM EST  

దొండపళ్ళ పచ్చడి :

మనము దొండకాయ కూర చేసుకున్నప్పుడు కొన్ని సార్లు దొండపళ్ళు వస్తూవుంటాయి , చాలా మంది వాటిని పారేస్తారు ..ఒక సారి ఇలా చేసి చూడండి.

దొండపళ్ళు : సన్నగా తరుకున్నవి 1 కప్పు
టమాటాలు : 2
ఎండుమెరపకాయలు : 5
పచ్చిమిర్చి : 2
కరివేపాకు , మినపప్పు, ఇంగువ ,మెంతులు : పోపు కి సరిపడ్డ
వెళ్ళుల్లి : 1-2 రెబ్బలు
చింతపండురసం: 1 -2 టేబుల్ స్పూన్లు
నుని: 4 టేబుల్ స్పున్లు
ఉప్పు : తగినంత .


ముందుగా మూకుడిలో నునె వేసుకొని అందులో మెరపకాయలు , ఇంగువ, మినపప్పు, మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకోండి.
అందులోనె పచ్చి మిర్చి ,టమాటముక్కలు, దొండపళ్ళ పుక్కలు వేసుకొని సన్నటి సెగమీద ఉంచి కాసేపు బాగా మగ్గనివ్వండి.
తరవాత ఉప్పు , చింతపండురసం వేసి చల్లరాక వెళ్ళుల్లి , వేయించుకొన్న మెరపకాయలు ,ఇంగువ వెసి రుబ్బుకోండి . పైన కరివేపాకు , మినపప్పు వేసుకోవాలి .

అన్నముతో కాని దోసలతో కాని బాగుంటుంది .ట్రై చెసి చెప్పండి ఎలా ఉందో...



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.