Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Maga Maharaju
Name: Gargi Pv

Post Number: 1195
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Monday, December 24, 2007 @5:16:55 AM EST  


ప|| రాజీవ నేత్రాయ రాఘవాయ నమో |
సౌజన్య నిలయాయ జానకీశాయ ||

చ|| దశరథ తనూజాయ తాటక దమనాయ |
కుశిక సంభవ యఙ్ఞ గోపనాయ |

పశుపతి మహా ధనుర్భంజనాయ నమో |
విశద భార్గవరామ విజయ కరుణాయ || `|| రాజీవ ||


చ|| భరిత ధర్మాయ శుర్పణఖాంగ హరణాయ |
ఖరదూషణాయ రిపు ఖండనాయ |

తరణి సంభవ సైన్య రక్షకాయనమో |
నిరుపమ మహా వారినిధి బంధనాయ || `|| రాజీవ ||



చ|| హత రావణాయ సంయమి నాథ వరదాయ |
అతులిత అయోధ్యా పురాధిపాయ |
హితకర శ్రీ వేంకటేశ్వరాయ నమో |
వితత వావిలిపాటి వీర రామాయ || `|| రాజీవ ||





Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.