Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Maga Maharaju
Name: Gargi Pv

Post Number: 1346
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Wednesday, January 02, 2008 @6:40:01 AM EST  



రాగం : సుద్ధదన్యాసి.

పల్లవి

భావములోన బాహ్యమునందున
గోవింద గోవింద అని కొలువవొ మనసా ...
|| భావములోన ||

చరణం 1

హరి అవతారములే అఖిల దేవతలు
హరి లోనివే బ్రహ్మండంబులు
హరి నామములే అన్ని మంత్రములు
హరి హరి హరి హరి ~ హరి అనవో మనసా ...
|| భావములోన ||

చరణం 2

విష్ణుని మహిమలే విహిత కర్మములు
విష్ణుని పొగడెడి వేదంబులు
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు
విష్ణువు విష్ణువని వెదకవో మనసా ...
|| భావములోన ||

చరణం 3

ఆచ్యుతుడితడే ఆదియు నంత్యము
ఆచ్యుతుడే అసురాంతకుడు
ఆచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీదానిదె
ఆచ్యుత ఆచ్యుత శరణనవొ మనసా ...
|| భావములోన ||




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.