Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Maga Maharaju
Name: Gargi Pv

Post Number: 1466
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Friday, January 04, 2008 @8:07:14 AM EST  


రాగం - భూపాళం


పల్లవి :

విన్నపాలు వినవలె వింత వింతలు...

అనుపల్లవి :

పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య..


!!చరణం 1 :
1. తెల్లవారు జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదిగో వారే
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు
మెల్లమెల్లనా విచ్చి మేలుకొనవేలయ్యా.
!!విన్నపాలు!!

చరణం 2:

గరుడ కిన్నరయక్ష కామినులు గములై
విరహపుగీతముల వింతాలాపాలా
పరిపరివిధముల పాడేరు నిన్నిదిగో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా !
!!విన్నపాలు!!

చరణం 3:
పొంకపు శేషాదులు తుంబురునారదాదులు
పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా !
!! విన్నపాలు !!




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.