Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Maga Maharaju
Name: Gargi Pv

Post Number: 1695
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Wednesday, January 09, 2008 @7:42:04 AM EST  



రాగం : సామంత

పల్లవి :

ఇందరికి అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి

చరణం : 1

వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగిలించినచేయి
పలనైన కొనగోళ్ళ వాడి చేయి

!! ఇందరికి !!
చరణం : 2

తనివోక బలిచేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి
!!ఇందరికి !!

చరణం : 3

పురసతుల మానములు పొల్లసేసినచేయి
తురగంబు బరపెడి దొడ్డచేయి
తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు
-తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.