Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Maga Maharaju
Name: Gargi Pv

Post Number: 2130
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Thursday, January 17, 2008 @7:56:29 AM EST  


పల్లవి :

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుఛ్ఛ్వాస పవనమందుండ నీ
భావంబు దెలిపె నీ వుయ్యాల

చరణాలు :

1. ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన
బుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన
అఖిలంబు నిండె నీ బుయ్యాల

2.పదిలముగ వేదములు బంగారు చేరులై
పట్టివెరపై తోచెనుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై
మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల

3.మేలు కట్లయి మీకు మేఘమణ్ణలమెల్ల
మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీలశైలము వంటి నీ మేని కాంతికి
నిజమైన తొడవాయె వుయ్యాల

4.పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ
భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరుగునో యని
భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల

5. కమలకును భూసతికి కదలు కదలకు
మిమ్ము కౌగలింపగ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హాస భావ
విలాస మందంద చూపె నీ వుయ్యాల

6. కమలాసనాదులకు కన్నులకు పండుగై
గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి
నీకు కడువేడుకై వుండె వుయ్యాల

Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.