Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22362
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 1  (Vote)

Posted On Tuesday, November 17, 2009 @4:54:33 AM EST  

అంతయు నీవే

పల్లవి
అంతయు నీవే హరి పుండరీకాక్ష
చెంతనాకు నీవే శ్రీరఘురామ

చరణములు
కులమును నీవే గోవిందుడా నా
కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా
నెలవును నీవే నీరజనాభ

తనువును నీవే దామోదర నా
మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విఠ్ఠలుడా నా
వెనకముందు నీవే విష్ణు దేవుడా

పుట్టుగు నీవే పురుషోత్త మ
కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీవేంకటేశ్వరుడా నాకు
నెట్టన గతి ఇంక నీవే నీవే



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.