Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22456
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @4:13:19 AM EST  

భోగీంద్రులును మీరు బోయి రండు

పల్లవి
భోగీంద్రులును మీరు బోయి రండు
వేగగ మీదటి విభవాలకు ||

చరణములు
హరుడ పోయిరా అజుడ నీవును బోయి
తిరిగిరా మీదటి తిరునాళ్ళకు
సురలు మునులును భూసురలు బోయిరండు
అరవిరి నిన్నాళ్ళు నలసితిరి ||

జముడ పోయిరా శశియు నీవును బోయి
సుముఖుడవై రా సురల గూడి
గుములై దిక్పతులు దిక్కులకు బోయిరండు
ప్రమదాన నిన్నాళ్ళు బడలితిరి ||

నారద సనక సనందాదులు
భూరివిభవముల బోయిరండు
దూరముగా బోకిట్టే తొరలి వేంకటగిరి
జేరి నన్నిట్లనే సేవించుడీ ||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.