Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22458
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @4:22:01 AM EST  

నేవె విచ్చేయవయ్య నేరుపరి విందుకెల్ల

పల్లవి
నేవె విచ్చేయవయ్య నేరుపరి విందుకెల్ల
నీ వనిత యలుకలు నేము దిద్దఁగలమా

చరణములు
మాఁట వోరువఁగ లేని మంకు దానిఁ గేరడాలు
యేఁటికి నాడితివయ్య యింతలో నీవు
వాఁటమై పారెఁ గన్నీటి వరదలు చన్నులపై
నీఁటున నింత టెలుక నేము దిద్దఁగలమా

కాఁక కోరువఁగలేని కాంతకుఁ గోపము రేఁచి
సోఁకింతురా కొనగోరు చురుకనను
వేఁకపు నిట్టూర్పులు విసరీ హారములపై
యేఁకట నింతేసి పను లేము దిద్దఁగలమా

రవ్వ కోరువఁగ లేని రమణితో జూజాలాడు
నవ్వుదురా శ్రీవేంకటనగరవిహార
పువ్వులు కొప్పుని రాలె పొందితే బుజాలమీఁద
నివ్వటిల్లు మీ వోజలు నేము దిద్దఁగలమా



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.