Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22460
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @4:23:16 AM EST  

నీడల చూపులు నీకేలే యీ

పల్లవి
నీడల చూపులు నీకేలే యీ
వాడక వాడెడి వడ నీకేలే

చరణములు
నిలువుల నటనలు నీకేలే, యీ
నిలుగుల నడపులు నీకేలే
నెలవుల కరగులు నీకేలే, యీ
కులికెడి నును సిగ్గులు నీకేలే

నెఱుల చెదరులివి నీకేలే, యీ
నెఱవగు చదరులు నీకేలే
నెఱతనపు సిరులు నీకేలే, యిదె
చెఱగున మూసెదు చెలి నీకేలే

నిక్కపుఁ బోఁకులు నీకేలే, యిదె
నిక్కల గంటివి నీకేలే
నిక్కితి వొరపుల నీకేలే, యిదె
దక్కె వేంకటోత్తముఁడు నీకేలే



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.