Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22461
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @4:25:10 AM EST  

నీకేమయ్యా నీకు నీవే దొడ్డవాఁడవు

పల్లవి
నీకేమయ్యా నీకు నీవే దొడ్డవాఁడవు
చేకొని చెట్టడిచితే చేటఁడేసి వాపులు

చరణములు
తలపోఁత లొక్కటైతే తమకమినుమడాయ
నిలువుకు నిలువే నీ బేరము
కొలిచినందే కొలిచి గోపికల కెల్లాను
వలవఁ దీసితివిగా వలపుల నీవు

నగవులు మానెఁడైతే నునుపులడ్డెఁ డేశాయ
నిగిడె నన్నిచోట్లా నీ బేరము
ఆగడుగా నాఁగిచ్చి అంగనల కెల్లాను
జిగి వడ్డిగోంటివి సిగ్గులెల్లా నీవు

మోవితేనగ్గువలైతే ముదములు లాభమాయ
నీవు నన్నుఁ గూడినదే నీ బేరము
భావించి శ్రీవేంకటేశ పడఁతుల కెల్లాను
వావాత నమ్మితివిగా వయసులు నీవు



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.