Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22463
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @4:38:16 AM EST  

నమో నమో దానవవినాశ చక్రమా

పల్లవి
నమో నమో దానవవినాశ చక్రమా
సమరవిజయమైన సర్వేశు చక్రమా

చరణములు
అట్టె పదారుభుజాల నమరిన చక్రమా
పట్టిన ఆయుధముల బలుచక్రమా
నెట్టన మూఁడుగన్నుల నిలచిన చక్రమా
ఱట్టుగా మన్నించవే మెఱయుచు చక్రమా

ఆరయ నారుగోణాల నమరిన చక్రమా
ధారలు వేయిటితోడి తగుచక్రమా
ఆరక మీఁదికి వెళ్ళే అగ్నిశిఖల చక్రమా
గారవాన నీ దాసులఁ గావవే చక్రమే

రవిచంద్రకోటి తేజరాసియైన చక్రమా
దివిజ సేవితమైన దివ్య చక్రమా
తవిలి శ్రీవేంకటేశు దక్షిణకర చక్రమా
యివల నీ దాసులము యేలుకోవే చక్రమా



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.