Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22465
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @4:40:44 AM EST  

దేవునికి దేవికిని తెప్పుల కోనేటమ్మ

పల్లవి
దేవునికి దేవికిని తెప్పుల కోనేటమ్మ
వేవేలు మొక్కులు లోకపావని నీకమ్మా

చరణములు
ధర్మార్థకామమోక్షతతులు నీ సోపానాలు
ఆర్మిలి నాలుగు వేదా లదె నీ దరులు
నిర్మలపు నీ జలము నిండుసప్తసాగరాలు
కూర్మము నీ లోఁతు వో కోనేరమ్మా

తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు
జగతి దేవతులు నీ జల జంతులు
గగనపుఁ బుణ్యలోకాలు నీ దరిమేడలు
మొగి నీ చుట్టు మాఁకులు మునులో యమ్మా

వైకుంఠ నగరము వాకిలే నీ యాకారము
చేకొను పుణ్యములే నీ జీవభావము
యేకడను శ్రీవేంకటేశుఁడే నీ వునికి
దీకొని నీ తీర్థ మాడితిని కావవమ్మా



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.