Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22467
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @4:54:17 AM EST  

దీనుఁడ నేను దేవుఁడవు నీవు

పల్లవి
దీనుఁడ నేను దేవుఁడవు నీవు
నీ నిజ మహిమే నెరపుట గాకా

చరణములు
మతి జనన మెఱఁగ మరణం బెఱఁగను
యితవుగ నిను నిఁక నెరిఁగేనా
క్షితిఁ బుట్టించిన శ్రీపతివి నీవే
తతి నాపై దయ దలఁతువు గాకా

తలఁచఁ బాపమని తలఁచఁ బుణ్యమని
తలఁపున ఇఁక నినుఁ దలఁచేనా
అలరిన నాలో అంతర్యామివి
కలుష మెడయ ననుఁ గాతువు గాకా

తడవ నా హేయము తడవ నా మలినము
తడయక నీ మేలు దడవేనా
విడువలేని శ్రీ వేంకట విభుఁడవు
కడదాఁకా నిఁకఁ గాతువు గాకా



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.