Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22468
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @4:54:40 AM EST  

తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁగన

పల్లవి
తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూఁగెఁగన
చెల్లుబడి నూఁగీని శ్రీరంగశిశువు

చరణములు
కలికి కావేరి తరగల బాహులతలనే
తలఁగ కిటు రంగ మధ్యపు తొట్టెలన్
పలుమారుఁ దనునూఁచి పాడఁగా నూఁగీని
చిలుపాల సెలవితో శ్రీరంగశిశువు

అదివొ కమలజుని తిరువారాధనం బసఁగ
అదనఁ గమలభవాండమను తొట్టెలన్
ఉదధులు తరంగముల నూఁచఁగా నూఁగీని
చెదరని సిరులతోడ శ్రీరంగశిశువు

వేదములె చేరులై వెలయంగ శేషుఁడే
పాదుకొను తొట్టెలై పరగఁగాను
శ్రీదేవితోఁ గూడి శ్రీవేంకటేశుఁడై
సేదదేరెడి వాఁడె శ్రీరంగశిశువు



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.