Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22469
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @4:56:29 AM EST  

తరుణి మేనికిని నీ తనువె మాతు

పల్లవి
తరుణి మేనికిని నీ తనువె మాతు
నిరతపుటాసకు నిండుఁ జూపె మాటు

చరణములు
చెలియ సిగ్గులకు చెక్కు చేయే మాటు
పలుకులకును మోవి పండె మాటు
నెలకొన్న చింతలకు నివ్వెరగే మాటు
బలు జవ్వనమునకును పయ్యెదే మాటు

ముంచిన నవ్వులకును మొక్కులివే మాటు
మంచి నడపులకు మట్టెలే మాటు
వంచిన శిరసునకును వాలుఁగొప్పే మాటు
కొంచని చనులకు కొనగోరే మాటు

పొందుల రతులకును పుక్కిటి విడెమె మాటు
అందిన వేడుకకు నాయములె మాటు
విందుల వలపులకు వేవేలు రతులె మాటు
యిందుముఖికై శ్రీవేంకటేశ నీయింపె మాటు



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.