Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22470
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @4:57:08 AM EST  

తరుణి నే యలుక కెంతటి దింతినీ వేళ

పల్లవి
తరుణి నే యలుక కెంతటి దింతినీ వేళ
కరుణించఁ గదర వేంకటశైలనాథా

చరణములు
ఒక మారు సంసారమొల్లఁ బొమ్మని తలఁచు
ఒక మారు విధిసేఁతలూహించి పొగడు
ఒక మారు తనుఁజూచి వూరకే తలవూఁచు
నొకమారు హర్షమున నొంది మేమఱచు

నిన్నుఁ జూచి వొకమారు నిలువెల్ల పులకించు
తన్నుఁజూచి వొకమారు తలపోసి నగును
కన్నుదెరచి నినుఁజూచి కడు సిగ్గుపడి నిలిచి
యిన్నియును తలపోసి యింతలో మఱచు

వదలైన మొలనూలు గదియించు నొకమారు
చెదిరిన కురులెల్ల చెరుగునొకమారు
అదనెరిఁగి తిరువేంకటాధీశ పొందితివి
చదురుఁడవు నినుఁ బాయఁ జాలదొక మారు



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.