Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22473
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @5:00:44 AM EST  

జిగురువంటివాఁడె శినకాటి చింత

పల్లవి
జిగురువంటివాఁడె శినకాటి చింత
శిగురమ్మఁబోనీఁడె శినకాటి

చరణములు
సేఁతి కుత్తికవాఁడు సెడకుండ దాఁచిన
పాఁత పెద్దవిల్లు బలుపున
నాఁతి కొరకు వచ్చి నడిమికి విఱిశిన
శేఁతలాఁడుగదె శినకాటి

రట్టడిశేఁతల రాకాశి నాయని
పట్టపు శెలియలిఁ బడవేశి
కొట్టఁ గొసముక్కు గోశివేసినట్టి
శిట్టగీఁడుగదె శినకాటి

నలువున వెంకట సగమునఁ గోనేటి
నెలవున సోంపుతో నెలకొని
కలిమి పడుసుతోడి కాఁపురమున్నట్టి
శిలుగులాఁడుగదె శినకాటి



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.