Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22475
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @5:03:54 AM EST  

చేరి కొల్వరో యీతఁడు శ్రీదేవుఁడు

పల్లవి
చేరి కొల్వరో యీతఁడు శ్రీదేవుఁడు
యీ రీతి శ్రీ వేంకటాద్రి నిరవైన దేవుఁడు

చరణములు
అలమేలుమంగ నురమందిడుకొన్న దేవుఁడు
చెలఁగి శంఖచక్రాల చేతి దేవుఁడు
కల వరదహస్తముఁ గటిహస్తపు దేవుఁడు
మలసీ శ్రీవత్స వనమాలికల దేవుఁడు

ఘన మకర కుండల కర్ణముల దేవుఁడు
కనక పీతాంబర శృంగార దేవుఁడు
ననిచి బ్రహ్మాదుల నాభిఁ గన్న దేవుఁడు
జనించెఁ బాదాల గంగ సంగతైన దేవుఁడు

కోటి మన్మథాకార సంకులమైన దేవుఁడు
జూటపుఁ గిరీటపు మించుల దేవుఁడు
వాటపు సొమ్ముల తోడి వసుధాపతి దేవుఁడు
యీటులేని శ్రీవేంకటేశుఁడైన దేవుఁడు



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.