Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22477
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @5:04:34 AM EST  

చాలుఁజాలును భోగసమయమున మైమఱపు

పల్లవి
చాలుఁజాలును భోగసమయమున మైమఱపు
పాలుపడునట యేఁటి బ్రతుకురా వోరి

చరణములు
ఇందుముఖి నిను కౌఁగిలించి లోపలి జగము
కందునని నీ బిగువు కౌఁగిలే వదలె
పొందైన వారితో పొసఁగ కౌఁగిటఁ జేర్ప
పొందుగాదట యేఁటి పొందురా వోరి

నెలఁత నీ వాలు కన్నులు మూసి జగమెల్ల
కలయ చీకట్లైన గక్కనను వదలె
వలచి నంగనలు తమ వలసిన విలాసముల
వలను నెఱపనిదేఁటి వలపురా వోరి

కొమ్మ నీ పురముపై గోరు దివియుచు నాత్మ
నిమ్మైన ననుఁదాక నిద్దరిని తాఁకె
దిమ్మరివి కోనేటి తిమ్మ నీపై ప్రియము
కుమ్మరించని దేఁటి కోర్కిరా వోరి



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.