Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22482
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @5:28:23 AM EST  

భావించి తెలుసుకొంటే

పల్లవి
భావించి తెలుసుకొంటే భాగ్యఫలము
ఆవలీవలి ఫలములు అంగజజనకుడే ||

చరణములు
దానములలో ఫలము తపములలో ఫలము
మోస(న)ములలో ఫలము ముకుందుడే
జ్ఞానములలో ఫలము జపములలో ఫలము
నానా ఫలములు నారాయణుడే ||

వినుతులలో ఫలము వేదములలో ఫలము
మనసులోని ఫలము మాధవుడే
దినములలో ఫలము తీర్థయాత్రల ఫలము
ఘనపుణ్యముల ఫలము కరుణాకరుడే ||

సతతయోగ ఫలము చదువులలో ఫలము
అతిశయోన్నత ఫలము యచ్యుతుడే
యతులలోని ఫలము జితకామిత ఫలము
క్షితి మోక్షము ఫలము శ్రీవేంకటేశుడే ||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.