Search Forum - Display Post

Topic : Religion/Society

Thread : ۞♫ అన్నమాచార్య కీర్తనలు ♫۞

PostedBy Message

Raga
Stalin
Name: Gargi Pv

Post Number: 22504
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating: <None>
Votes: 0  (Vote)

Posted On Wednesday, November 18, 2009 @8:46:10 AM EST  

పంకజాక్షులు

పల్లవి
పంకజాక్షులు సొలసిపలికి నగగా-
నింకా నారగించు మిట్లనే అయ్యా ||

చరణములు
కలవంటకములు పులుగములు దుగ్ధాన్నములు
పలుదెరగులైన అప్పములగములు
నెలకొన్ననేతులును నిరతంపుచక్కెరలు
గిలుకొట్టుచును నారగించవయ్యా ||

పెక్కువగునై దంపుపిండివంటలమీద
పిక్కిటిలు మెర్కుగుబొడి బెల్లమును
వొక్కటిగ గలుపుకొని వొలుపుబప్పులతోడ
కిక్కిరియ నిటు లారగించవయ్యా ||

కడుమధురమైన మీగడపెరుగులను మంచి-
అడియాల వూరుగాయల రుచులతో
బడిబడిగ నవకంపు బళ్ళెరంబులతోడ
కడునారగించు వేంకటగిరీంద్రా ||



Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.