Search Forum - Display Post

Topic : Food/Recipes

Thread : వంట - వార్పు

PostedBy Message

Raga
Maga Maharaju
Name: Gargi Pv

Post Number: 2283
Points: 502,634
Member Since: Oct 20, 2007
Status :

Rating:
Votes: 2  (Vote)

Posted On Monday, January 21, 2008 @7:33:36 AM EST  

!!! పల్లీల - టమాటో పచ్చడి !!!

పళ్ళీలు - ఒక చిన్న కప్పుడు.
టమాటోలు - 1
ఉల్లిపాయ - 1
ఉప్పు - తగినంత.
సెనగపప్పు - 1 టేబల్ స్పూన్
మినపప్పు - 1 టెబల్ స్పూన్
దనియాలు , మెంతులు , ఆవాలు , జీరకర్ర - ఒక టేబల్ స్పూన్.
పచ్చి మిర్చి - 1-2
ఎండు మెరపకాయ - 1.
ఎర్ర కారం - చిటెకెడు.
నూనె - 3 స్పూనులు .
చింతపండు రసము - 1/2 స్పూన్ ( కావల్స్తే).
కొత్తెమీర - కొంచము.

ముందుగా పళ్ళీలు వేయించుకొని పక్కన పెట్టుకోవలెను.

బాండలిలో ఒక స్పూన్ నూనె వేసి అందులో ధనియాలు ,సెనగపప్పు , మినపప్పు , జీరకర్ర , ఆవాలు , మెంతులు వేయించుకోవాలి. అవి వేగాక అందులో పచ్చిమిర్చి , ఎండుమిర్చి కూడ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
అందులోనే ఇంకో స్పూన్ నూనె వేసి ఉల్లిపాయ వేయించి పక్కన పెట్టుకొని , అందులో
టమాట కూడ వేయించుకొని , ముందుగా వేయించు కొన్న వాటిలో కలిపి అందులో ( కావల్స్తే ) చింతపండు రసము , ఉప్పు , ఎర్రకారము , కొత్తెమీర వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.

ఇడ్లిలతో , దోశలల తో ఈ పచ్చడి బాగుంటుంది.




Trust in God
Believe in yourself
Dare To Dream.
Desire what you deserve.